NTV Telugu Site icon

టైంకి సెకండ్‌ డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా..!

YS Jagan

YS Jagan

ఇవ్వాల్సిన సమయానికి సెకండ్‌ డోస్‌ వేయకపోతే వ్యాక్సిన్‌ వృథా అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌.. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ ద్వారానే కోవిడ్‌కు పరిష్కారం అన్నారు.. వ్యాక్సినేషన్‌లో ఇంకా చాలాదూరం మనం వెళ్లాల్సి ఉందన్న ఆయన.. సెకండ్‌ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. అసలు ఇవ్వాల్సిన టైంలో వారికి సెకండ్‌డోస్‌ ఇవ్వకపోతే వ్యాక్సిన్‌ వృథా అవుతుందని సూచించారు.. 45 ఏళ్లు పైబడిన వారికి 90 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయితే.. మిగిలిన కేటగిరీలపై దృష్టిపెట్టాలని సూచించారు.. మరోవైపు.. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిల్లో, ప్రతినెలా రెండో శుక్రవారం మండల, ప్రతినెల మూడో శుక్రవారం జిల్లా స్థాయ్లిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు కచ్చితంగా జరగాలని స్పష్టం చేశారు సీఎం జగన్.. ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్యయాత్రలు నిర్వహించాలని.. ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఇ– క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.