NTV Telugu Site icon

థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. వ‌స్తే ఎదుర్కోవ‌డానికి సిద్ధం కావాలి..

ys jagan

క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వ‌చ్చిన ప‌రిస్థితి మాత్రం లేదు.. ఇదే స‌మ‌యంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లుచేశారు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న‌.. వివిధ అంశాల‌పై దిశ‌నిర్దేశం చేస్తూ.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు. ఇక‌, థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెబుతున్నారు.. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాల‌ని సూచించారు.. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాల‌ని చెప్పిన ఏపీ సీఎం.. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాల‌న్నారు.. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాల‌న్న ఆయ‌న‌.. పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం.. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఏర్పాటుచేస్తామ‌ని.. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాల‌ని సూచించారు.