CM Jagan: కుమార్తెను చూసి గర్వపడిన సీఎం జగన్-భారతి దంపతులు

Cm Jagan

Cm Jagan

ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమార్తె హర్షిణి రెడ్డి ప్యారిస్‌లోని ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా తమ కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఈ పట్టా ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన భార్య భారతి పాల్గొన్నారు. తమ కుమార్తె డిగ్రీ పట్టా అందుకున్న తరుణంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Pawan Kalyan: సమాజ క్షేమమే.. జనసేన పార్టీ ధ్యేయం

‘డియ‌ర్ హ‌ర్షా చాలా గ‌ర్వంగా ఉంది. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింది. దేవుడు నీ ప‌ట్ల కృప చూపించాడు. ఈ రోజు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డం నాకు గర్వంగా ఉంది’ అంటూ జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. తన కుమార్తెకు డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంద‌ని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హర్షిణి రెడ్డితో జగన్ దంపతులు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త‌ల్లిదండ్రుల స‌మ‌క్షంలోనే హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా పుచ్చుకున్నట్లు ఈ ఫోటోలో చూడొచ్చు. రేపు సాయంత్రం ప్యారిస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ గన్నవరం చేరుకోనున్నారు. కాగా ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి డిగ్రీ పట్టా అందుకోవడంపై సోష‌ల్ మీడియాలో నెటిజన్‌ల నుంచి ప్రశంస‌లు వెల్లువెత్తుతున్నాయి.