విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పారు. ఇటీవల కేబినెట్‌లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలకు ఉపయోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే ఎవరికి ఏ పార్లమెంట్ అప్పగించారన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరినీ విజయవాడకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక‍్టర్ ఘన స్వాగతం పలికారు.
Andhra Pradesh: విశాఖలో నేడు హర్యానా సీఎంతో సీఎం జగన్ భేటీ.. కారణం ఇదేనా?