Site icon NTV Telugu

CM Chandrababu: నేడు చెన్నైకు ఏపీ సీఎం చంద్రబాబు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ( మార్చ్ 28) చెన్నై వెళ్లనున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్‌ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్‌ స్కాలర్స్‌ సమ్మిట్‌-2025’లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. ఈ పర్యటన కోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10.30 గంటలకు వెళ్లబోతున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రెడీ అవుతున్నారు. కాగా, మీనంబాక్కంలోని ఓల్డ్ ఎయిర్ పోర్టులో 6వ నెంబరు గేట్‌ నుంచి చంద్రబాబు బయటకు వస్తారు.

Read Also: Husband kills wife : భార్యను ముక్కలు, ముక్కలుగా నరికి.. సూట్‌కేస్‌లో దాచిపెట్టిన భర్త.. తర్వాత…

అయితే, ఇదిలా ఉండగా నాలుగోసారి సీఎం అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలి రావాలని చెన్నై తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు మద్రాస్‌ ఐఐటీ నుంచి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి విజయవాడ బయలుదేరి రానున్నారు.

Exit mobile version