CM Chandrababu: ఐదు రోజుల పర్యటన కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో సహా ఇతర మంత్రులు సింగపూర్ చేరుకున్నారు. అయితే, వారికి పుష్పగుచ్ఛాలతో స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రధారణలో తరలి వచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు.. కూచిపూడి నాట్యంతో చిన్నారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా హోటల్ ప్రాగణంలో తెలుగు కుటుంబాల సందడి చేశాయి. ఐదు రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో ఏపీ సీఎం పాల్గొననున్నారు.
Read Also: Today Horoscope: ఆదివారం దినఫలాలు.. నేడు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఇక, మొదటి రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..
* ఇవాళ మొదటి రోజు సింగపూర్ పర్యటన లో సీఎం చంద్రబాబు అండ్ టీం.. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
* తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి 1500 మంది ప్రతినిధులు హాజరు..
* P4లో భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమంలో కోరనున్న ఏపీ సీఎం చంద్రబాబు..
* సింగపూర్ లో ఇవాళ భారత్ హై కమిషనర్ శిల్పక్ తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు..
* ఇవాళ రాత్రి భారత్ హై కమిషనర్ తో కలిసి విందులో పాల్గొననున్న ఏపీ సీఎం..
* ప్రముఖ సంస్ధ సుర్బాన జారాంగ్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ఎవర్ సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏకే నాథన్ తో పెట్టుబడుల అంశంపై చంద్రబాబు చర్చలు జరపనున్నారు.