NTV Telugu Site icon

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్కు ఆమోదం తెలిపే ఛాన్స్!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగానే, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలువుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. ఇక, కౌన్సిల్ లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.