AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. రూ. 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం. అలాగే, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.
Read Also: MP: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడిపై 13 గంటలు దాడి
అయితే, రాజధాని అమరావతిలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక, మంత్రి వర్గ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పెరోల్ అంశంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ఇతర అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. అలాగే, కొన్ని విషయాల్లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించే అవకాశం ఉంది.
