Site icon NTV Telugu

Ap Cabinet Meet: 29 జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

Jagan 1 (3)

Jagan 1 (3)

ఈనెల 29న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదాపడింది. కేబినెట్ భేటీని ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నెల 29న జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీని సెప్టెంబర్ ఒకటవ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. అయితే, కేబినెట్ భేటీని వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌లేదు.ఈసమావేశంలో పలు కీలక అంశాలను చర్చించాల్సి వుంది. సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది. అలాగే పలు అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేబినెట్ భేటీ వాయిదాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. మరోవైపు ఇవాళ నాలుగో విడత నేతన్న నేస్తానికి సర్వం సిద్ధమైంది.

ఈనెల 25న గురువారం వైఎస్ఆర్ నేత‌న్న నేస్తం 4వ విడ‌త కార్య‌క్ర‌మాన్ని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. నాలుగో విడతలో 80,546 మంది లబ్ధిదారులకు..193.31 కోట్లు జమ చేయనున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం చేనేతలకు వైయ‌స్సార్‌నేతన్న నేస్తం అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి యేటా రూ. 24 వేల నగదు సాయం అందుతోంది. తొలి విడతలో ఎవరికైనా సాంకేతిక కారణాలతో సాయం అందకపోతే తిరిగి మళ్లీ అందజేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో నాల్గవ విడత నేతన్న నేస్తం నగదును ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా చేనేతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి రూ. 72 వేల సాయం అందింది.

Read Also: America Student Visa: అమెరికా స్టూడెంట్‌ వీసా రిజెక్ట్‌ అయిందా?. మళ్లీ ఛాన్స్‌.

Exit mobile version