NTV Telugu Site icon

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. నూతన పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం

Ap Cm

Ap Cm

AP Cabinet: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. అయితే, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట, అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టడం, రీహాబిలిటేషన్ పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.

Read Also: Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు.. స్పందించిన బీసీసీఐ వర్గాలు!

ఇక, రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించిన మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ ఉండాలని కాబినెట్ నిర్ణయించింది. ఇక, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది.. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి చంద్రబాబు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Read Also: C 202 Movie: వెన్నులో వణుకు పుట్టించే ‘సి 202’ రిలీజ్ ఎప్పుడంటే?

అలాగే, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం.. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీల నియామకంపైనా సుధీర్ఘంగా కేబినెట్ లో చర్చించారు. మూడు క్యాబినెట్ సబ్ కమిటీలకు ఆమోదం లభించింది. వీటితో పాటు అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు పైనా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక, చెత్త పన్ను రద్దుపైనా కూడా కేబినెట్ తీర్మానం చేయనుంది.