Site icon NTV Telugu

AP Budget Session: వచ్చే నెలలో ఏపీ బడ్జెట్‌ సమావేశాలు..?

Ap Budget Session

Ap Budget Session

AP Budget Session: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.. ఫిబ్రవరి చివరి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు? జరిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ సారి 20 నుంచి 25 రోజుల పాటు బడ్జెట్‌ సెషన్‌ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. అయితే, ఫిబ్రవరి గడిస్తే.. ఆ తర్వాత రాష్ట్రం అంతర్జాతీయ సదస్సులు జరగబోతున్నాయి.. దీంతో.. ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.. ఎందుకంటే.. మార్చి నెలలో రెండు కీలక అంతర్జాతీయ సదస్సులు రాష్ట్రంలో జరగబోతున్నాయి.. సదస్సుల షెడ్యూల్, అసెంబ్లీ తేదీలు క్లాష్ కాకుండా నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు.. కాగా, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతోంది.. ఆ తర్వాత మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. వీటికంటే ముందుగానే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ 2023-24ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.. ఇక, ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏదేమైనా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం విదితమే.

Read Also: New Parliament Building Latest Pics: ఆకట్టుకుంటున్న పార్లమెంట్ కొత్త భవనం.. ఈ ఫొటోలు చూసి తీరాల్సిందే..

Exit mobile version