NTV Telugu Site icon

మే 20 న ఏపీ అసెంబ్లీ సమావేశాలు… ఎన్నిరోజులంటే 

2020 నుంచి దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది.  గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు అనేక మార్లు వాయిదా వేస్తూ వచ్చాయి.  కరోనా కంట్రోల్ లోకి రావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు.  ఆ తరువాత  వరసగా ఎన్నికలు జరిగాయి.  మే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది.  బడ్జెట్ సమావేశాలను జూన్ 3 లోగా తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.  దీంతో మే 20 వ తేదీన బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అయితే, కరోనా విజృంభిస్తుండటంతో ఒక్కరోజు మాత్రమే సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.  ఎన్ని రోజులు నిర్వహించాలి అనే విషయం బిఏసి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.