Site icon NTV Telugu

AP BJP : నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు..

ఏపీలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఉదంతాలను నిరసిస్తూ నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల రక్షణలో ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఆందోళనకు పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపనున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరుగగా, ఆ తరువాత ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ కొడుకు వివాహితను అత్యాచారం చేశాడు.

ఇవే కాకుండా వరుస ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాయి. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక దిశా వాహనాన్ని కూడా ఏర్పాటు చేసింది పోలీస్‌ శాఖ. ఇక నుంచి అనుమాతిన ప్రదేశాల్లో సంచరించడం, అనుమానితులకు కౌన్సిలంగ్‌ ఇవ్వడం, అలాగే దిశా యాప్‌ అందరూ వాడాలని అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

Exit mobile version