Site icon NTV Telugu

AP BJP: చంద్రబాబుకు బీజేపీ కౌంటర్.. వరుస ట్వీట్లతో విమర్శల వర్షం

Chandrababu Bjp

Chandrababu Bjp

AP BJP: తాను అధికారంలోకి వస్తే వడ్డీతో సహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్లపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేసింది. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారిమళ్లించి ఏపీని సీఎం జగన్ 90 శాతం నాశనం చేస్తే తాను 100 శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని బీజేపీ ట్వీట్ చేసింది.

2024లో టీడీపీ, వైసీపీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. మరీ బరితెగించి తాను అధికారంలోకి వస్తే వడ్డీతో సహా పాత సంక్షేమ పథకాలను మైనారిటీలకు ఇస్తామని చెప్పడటం టీడీపీ దివాళాకోరు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అభివృద్ధి అజెండాతో గుజరాత్‌లో ఏడు సార్లు గెలిచిన ఫలితాలను చూసి ఏపీ ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాలని బీజేపీ తన ట్వీట్‌లో సూచించింది. రాష్ట్రంలో 2024లో ప్రజలకు పంచడానికి ఏముంది..? హెరిటేజ్ పాలు, భారతి సిమెంట్ కంపెనీల ఆదాయం తప్ప అని ఎద్దేవా చేసింది.

Read Also: Minister Roja: మంత్రి రోజా కౌంటర్.. పవన్ ఎవరి సైన్యంలో దూరి యుద్ధం చేస్తారు?

Exit mobile version