ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ప్రత్యేక హోదా అంశం తొలగింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రమేయం కూడా ఉందంటూ బీజేపీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక హోదా అంశం ఏపీకి సంబంధించిన అంశం అని, స్పెషల్ స్టేటస్‌తో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం తొలగించిందని సోమువీర్రాజు వివరణ ఇచ్చారు.