NTV Telugu Site icon

Thammineni Seetharam: పొరపాటు చేస్తే చరిత్ర క్షమించదు.. జగన్‌కు పట్టాభిషేకం చేయాల్సిన బాధ్యత మనదే..!

Thammineni Seetharam

Thammineni Seetharam

అవినీతి చేతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కత్తిరించేశారు.. ఇవాళ లబ్దిదారులకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.. వార్ జోన్‌లో అడుగు పెట్టాం.. యుద్ధంలో గెలిచి వైఎస్‌ జగన్‌కు మళ్లీ పట్టాభిషేకం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం.. జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు.. ఇలా ఎంతో మంది బీసీల్లో యోధులున్నారన్నారు.. చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? అని ఎద్దేవా చేశారు.. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని నిలదీసిన ఆయన.. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలుసు.. తోకలు కత్తిరిస్తాను అన్నందుకే చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశారని కామెంట్ చేశారు.

Read Also: Parliament Sessions: “జీ20 సమ్మిట్‌.. భారత సామర్థ్యాలను ప్రదర్శించేందుకు సువర్ణావకాశం”

ఇక, అచ్చెన్నాయుడు నీ నాలుక తెగుతుంది.. నీ నాలుక చీలిక అవుతుంది అంటూ హెచ్చరించారు తమ్మినేని సీతారం.. వచ్చే ఎన్నికల్లో బీసీలు చరిత్ర తిరిగి రాయనున్నారు.. నీ ఐదేళ్ళలో బీసీలకు ఎంత చేశావో చర్చకు వస్తారా? అని సవాల్‌ విసిరారు.. బీసీలు అందరం సమైక్యంగా ఉండి వైఎస్‌ జగన్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చిన ఆయన.. పొరపాటు చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు.. పేద వాడిగా పుట్టడం తప్పుకాదు.. కానీ, పేదరికంలో చనిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారని గుర్తుచేశారు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.