NTV Telugu Site icon

సీఎం, లబ్ధిదారులకు మధ్య దళారులు లేరు.. ప్రతీ పైసా ప్రజలకే..!

Tammineni Sitaram

Tammineni Sitaram

తమ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి లబ్ధిదారులకు మధ్య దళారులే లేరు… ప్రతీ పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం.. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కొంచాడ గ్రామంలో హరితవనహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దొరికింది దొరికనట్లు దోచుకుతిన్నారు.. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి జన్మభూమి కమిటీల వరకూ గుటకాయస్వాహా చేశారు.. వాళ్లకే సరిపోకపోతే ఇక ప్రజలకేం పంచుతారు అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్ గత పాలకుల్లా కాదు.. చిత్తశుద్ధి కలిగిన నాయకుడు.. అందుకే వచ్చిన బడ్జెట్ లో ప్రతీ పైసాను ప్రజలకోసమే ఖర్చు చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా విజృంభణలోనూ ఏ ఒక్క కార్యక్రమం ఆగలేదని.. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి లబ్ధిదారులకు మధ్య దళారులు లేరు అని వ్యాఖ్యానించారు స్పీకర్‌ తమ్మినేని.