Site icon NTV Telugu

AP Assembly Sessions: ఈ నెల 18 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ హాజరుపై ఉత్కంఠ!

Ap Assembly

Ap Assembly

AP Assembly Sessions: AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. ఇక, ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలవుతాయి.. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఇక, మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగాలి, ఏఏ అంశాలపై చర్చ జరగాలి అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: GST: 18శాతం డెవలరీ చార్జ్ లు పెంచిన స్విగ్గీ, జొమోటో

ఇక, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హాజరుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన శాసన సభ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ, ఈసారి హాజరవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అలాగే, రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రతిపక్షంగా వైసీపీ స్పందన వంటివి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.

Exit mobile version