Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Cbn

Cbn

CM Chandrababu: ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. జీవ వైవిద్యం- ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో అసెంబ్లీ సెక్రటేరియట్ క్యాలెండర్ ను రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్ రూపొందించింది.

Read Also: Rahul Gandhi vs BJP: విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారు.. రాహుల్‌గాంధీపై బీజేపీ ఫైర్

ఇక, ఏపీలో ఉన్న వివిధ వన్య ప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన చేసింది అసెంబ్లీ సెక్రటేరియట్. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా డిజైన్ చేయించిన శాసన సచివాలయం. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనలను చాటిచెప్పేలా 2026 క్యాలెండర్ ఉంది. 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను చక్కగా డిజైన్ చేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందన్నారు. ఇక, క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎంకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

Exit mobile version