వాడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సభలో 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ ముందుకు రానుంది సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ నివేదికను సభ ముందు ఉంచనుంది ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
టీడీపీ సభ్యుల నిరసన, సస్పెన్షన్ అనంతరం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరు మార్పును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి. భారీగా 104, 108 అందుబాటులో తెచ్చాం. విప్లవాత్మక మార్సులతో వైద్యరంగం మారబోతోంది. విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. WHO GMP మందులు అందుబాటులోకి తెచ్చాం. 40,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరో 4000 అక్టోబర్ నాటికి రిక్రూట్ చేస్తున్నాం. ఎవరికీ అగౌరవం కలిగించేది కాదన్నారు. వారికి సంబంధించిన క్రెడిట్ డ్యూ వుంటే అది కూడా చేస్తాం. ఈ బిల్లుని ఆమోదించాలని జగన్ శాసనసభను కోరారు.
పేరు మార్చడానికి అనేక విధాలుగా ఆలోచించాక.. కరెక్ట్ అనిపించాక అడుగులు ముందుకు వేశానన్నారు సీఎం జగన్. ఏపీలో అమలవుతున్న 108, 104 పథకాలకు సృష్టికర్త వైఎస్సార్. ఆయన డాక్టర్ గా పనిచేశారు. పులివెందుల లో ఆస్పత్రి పెట్టి మంచి పేరు సంపాదించుకుని, రాజకీయాల్లోకి వచ్చారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, డాక్టర్ వైఎస్పార్. కుటుంబంలో వ్యక్తి వైద్యం అందక మరణిస్తే కుటుంబం ఎలా తట్టుకోలేకపోతుందో ఆయనకు తెలుసు. ఖరీదైన కార్సొరేట్ వైద్యాన్ని పేదలకు అందించారు మానవతావాద మహా శిఖరం వైఎస్సార్. ఆరోగ్యరంగంలో వెలిగే సూర్యుడు వైఎస్పార్. ప్రధానితో సహా అంతా కొనియాడే వ్యక్తి వైఎస్సార్ అన్నారు జగన్. ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలు వున్నాయి. ఇందులో 8 కాలేజీలు టీడీపీ పుట్టకముందే వచ్చాయి. శ్రీకాకుళం, ఒంగోలు, కడప కాలేజీలు పెట్టింది వైఎస్సార్. మొత్తం 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్, ఆయన కొడుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏర్పాటవుతున్నాయి. టీడీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. తమ ప్రభుత్వం వుందని తమకిష్టమయిన పేరు పెట్టుకున్నారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వారికి క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? మాకు ఎన్టీఆర్ అంటే కల్మషం లేదు. ఆయన పై అభిమానం వుంది.
ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకంటే ఎక్కువ గౌరవం ఉంది. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా నేనెప్పుడూ మాట్లాడలేదు. నందమూరి తారక రామారావు అని మనం పలికితే చంద్రబాబుకి నచ్చదు. చంద్రబాబు ఎన్టీఆర్ అని పలికితే ఎన్టీఆర్ కి నచ్చదు. ఎన్టీఆర్ అంటే గొప్పనటుడు, గొప్ప ఖ్యాతి సంపాదించిన వ్యక్తి అని దేశంలో అందరికీ తెలుసు. ఆయన బతికి వుండి వుంటే పూర్తిస్థాయి సీఎంగా పనిచేసి వుండేవారు.
ఎన్టీఆర్ బతికి వుంటే చంద్రబాబు అసలు సీఎం అయ్యేవాడు కాదు. స్వంత అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు, రెండుపత్రికలు చేసిన పని వల్ల మానసిక క్షోభతో మరణించారు. మన పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన్ని మనం ఏం అనలేదు. పాదయాత్రలో ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెడతానన్నాను. పేరు కూడా పెట్టాను. 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ఎన్టీఆర్ పేరు ఎలా మర్చిపోయేలా చేయాలనేది చంద్రబాబు మాట్లాడిన మాటలు వీడియోలు చూశాం. వాడు వీడు.. అని ఎన్టీఆర్ ని అగౌరవపరిచారు అన్నారు సీఎం జగన్. చంద్ద్రబాబుకి తన కూతురిని అల్లుడికి గిఫ్ట్ గా ఇస్తే.. అల్లుడు వెన్నుపోటుని రిటన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. తాను కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు చెబుతుంటారు. ఎంతోమంది రాష్ట్రపతుల్ని చేశానని, ఎంతోమందిని ప్రధానుల్ని చేశానంటారు. మోడీ కూడా తనకంటే జూనియర్ అంటారు.
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన మీరు ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు. ఎన్టీఆర్ అంటే జగన్ కి ఎంత ప్రేమ ఉందో ఎన్టీఆర్ పేరు మీద జిల్లా పెట్టామన్నారు మంత్రి రోజా. అధికారం లేకుంటే ఎన్టీఆర్ గురించి పట్టించుకుంటారు. అధికారం వుంటే ఎన్టీఆర్ ఫోటోలు తీసిపారేస్తారు చంద్రబాబు. పదిమందికి మంచి చేసిన వైఎస్సార్ ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద వుంది. వైఎస్సార్ పేరు పెట్ట ఆప్ట్ గా వుంది. ఆయనకు మరోసారి అభినందనలు అన్నారు మంత్రి రోజా. చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలి.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీల అభ్యంతరం.
స్పీకర్ పొడియం వద్ద ఆందోళన కొనసాగిస్తోన్న టీడీపీ.
సభ్యుల ఆందోళన మధ్యే బిల్లులకు ఆమోదం తెలుపుతోన్న శాసన మండలి.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై పలు కీలక అంశాలను ప్రస్తావించిన కాగ్
2020-21 లో ఏపీ గత ఐదేళ్లలో కంటే అతి తక్కువ జీఎస్‌డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది
రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎమ్ చట్టాన్ని 2020 డిసెంబర్ లో సవరించింది... కానీ చట్ట సవరణలు మాత్రం ఆగష్టు 30, 2020 నుంచే అమల్లోకి వచ్చాయి
ఈ సవరణలు 2015-16 నుంచి అమల్లోకి వచ్చేటట్లు సవరణ చేసింది
రెవెన్యూ, ద్రవ్య, ప్రాధమిక లోటుల కొలమానాలు 2016-21 కాలంలో నెగెటివ్ గా ఉన్నాయని తేల్చిన కాగ్
రెవెన్యూ ఖర్చులను క్యాపిటల్ వ్యయంగా, ప్రభుత్వ పద్దులలో ఇతర రుణాలు చూపకపోవడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి
సభలో గందరగోళంతో రెండో సారి వాయిదా పడిన మండలి.
సభ జరిగినంత సేపూ నిలబడి టీడీపీ ఆందోళనకు మద్దతు పలికిన
పిడిఎఫ్, ఎస్టీయూ, బిజెపి సభ్యులు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలంటూ డిమాండ్ చేసిన పీడీఎఫ్, ఎస్టీయూ, బీజేపీ సభ్యులు.
సభ వాయిదా పడినా లోపలే ఉండి నిరసన తెలుపుతున్న టీడీపీ సభ్యులు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సందర్భంగా సభలో గందరగోళం.
టీడీపీ సభ్యులు.. మార్షల్స్ మధ్య వాగ్వాదం, తోపులాట.
మార్షల్స్ తమ పట్ల దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ సభ్యుల మండిపాటు.
టీడీపీ సభ్యులకు మార్షల్ స్కూల్ మధ్య సభలో తోపులాట.
సభలో నేల మీద పడుకుని నిరసన తెలిపిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
మార్షల్స్ చర్యల పట్ల టీడీపీ నేతల అభ్యంతరం.
వాయిదా అనంతరం ప్రారంభమైంది శాసన మండలి. ఛైర్మన్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నారు.
అసెంబ్లీ తిరిగి ప్రారంభం అయింది. పోడియం వద్ద ఆందోళన కొనసాగించిన టీడీపీ ఎమ్మెల్యేలు. కాగితాలు చించి స్పీకర్ మీద విసిరిన టీడీపీ సభ్యులు. సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.
శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం.
వ్యక్తిగత విమర్శలు చేసుకున్న అధికార- ప్రతిపక్ష సభ్యులు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ విమర్శలు చేసిన అధికార పక్షం ఎమ్మెల్సీలు.
కౌంటర్ నినాదాలిచ్చిన టీడీపీ సభ్యులు.
బాబాయి కి గొడ్డలిపోటు, చెల్లికి వెన్నుపోటు,
తల్లిని గేంటేసిన అబ్బాయ్ అంటూ నినాదాలు చేసిన టిడిపి ఎమ్మెల్సీలు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్.
శాసన మండలి వాయిదా పడింది. మండలిలో టీడీపీ సభ్యుల గందరగోళం నేపథ్యంలో మండలి వాయిదా
మండలిలో గందరగోళం నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఛైర్మెన్ పోడియం చుట్టూ ముట్టిన టిడిపి ఎమ్మెల్సీలు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లు ఉపసంహరించాలంటూ నిరసన. ఒకవైపు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టీడీపీ సభ్యుల నిరసన కొనసాగింది.
స్పీకర్ పై పేపర్లు చల్లిన టీడీపీ సభ్యులు. ఆగ్రహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి టీడీపీ సభ్యుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనసభాపతి. ఇయర్ ఫోన్స్ తీసి విసురుగా టేబుల్ పై పెట్టిన స్పీకర్. వెంటనే స్పీకర్ కు రక్షణగా పోడియం పైకి వచ్చిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు. వెంటనే సంయమనం పాటించి సభను వాయిదా వేసిన స్పీకర్
టీడీపీ సభ్యులకు ఎన్టీఆర్ పేరును ప్రస్తావించే హక్కు లేదు.బుచ్చయ్య చౌదరి ఒక్కరికే ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే హక్కు ఉంది. చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇక్కడ ఉన్న సభ్యుల్లో బుచ్చయ్యచౌదరి ఒక్కరే ఎన్టీఆర్ పక్షాన నిలబడ్డారు. మిగిలిన వాళ్ళంతా వెన్నుపోటు దారులే అన్నారు మంత్రి అంబటి. మరో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యుల తీరు, గతంలో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఓ ఛానెల్ లో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. బిల్లుపై చర్చ జరగినప్పుడే మాట్లాడదాం అన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లును వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టీడీపీ సభ్యులు.
సభలో హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై గందరగోళం ఏర్పడింది. ఎన్టీరామారావుగారిపైమాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వుంది. అందుకే ఆయన పేరు పెడుతున్నాం. ఒక జిల్లా పేరుకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాం. రాజకీయంగా ఏమీ లేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ సభ్యులు. రాజకీయదురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని విమర్శించారు శ్రీకాంత్ రెడ్డి.