NTV Telugu Site icon

Visakhapatnam: అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..

Untitled 1

Untitled 1

Visakhapatnam: అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది. NTV తో మాట్లాడిన యువతి తల్లి.. తన కూతుర్ని వర్మ అనే యువకుడు కొండ పై నుండి తోసేసి యువతి దగ్గర ఉన్న డబ్బులు నగలు తీసుకుని పారిపోయాడని ఆరోపించింది. కాగా యువతి మాత్రం కొండ పై నుండి జారిపడినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం మరో ట్విస్ట్ ని తెలియచేసారు గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్. NTV తో మాట్లాడిన గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్ ఈ ఘటన గురించిన విషయాలను వెల్లడించారు. నిన్న అప్పికొండ సముద్ర తీరంలో ఓ అమ్మాయి పడిపోయి ఉంటే స్థానికంగా ఉన్న మత్యకారులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని.. కాగా యువతి కాళ్లకు బలమైన గాయాలు తగిలి ఉండడంతో ఆమెను కెజిహెచ్ కు తరలించామని పేర్కొన్నారు.

Read also:Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!

అయితే ఫణీంద్ర వర్మ రాజు అనే యువకుడితో గత నెల 29న విశాఖకు వచ్చిందని. ఇంట్లో చెప్పకుండా రావడంతో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా. యువతిపై మచిలీపట్నం ఇనుగుదురుపేట పిఎస్ లో గత నెల 29న మిస్పింగ్ కేసు నమెదు అయ్యిందని.. కాగా విశాఖపట్నం వచ్చిన ఈ జంట గోపాలపట్నం నాయుడు గార్డెన్ లాడ్జిలో ఉండి ఈ నెల 2వ తేదిన అప్పికొండ శివాలయంకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అరకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు అని తెలిపారు ఎసిపి త్రీనాథ్. కాగా ఈ నెల 8వ తేదిన మరల అప్పికొండ శివాలయంకు వచ్చి స్వామీ దర్శనం చేసుకున్న ఈ జంట.. తిరిగి వెళ్లే సమయంలో తను కాలు జారి సముద్రంలో పడిపోయినట్లు యువతి స్టెట్మెంట్ ఇచ్చిందని.. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదని చేప్పిందని ఆయన తెలిపారు. కాగా ఇనుగుదురుపేట పోలీసులు సెట్మెంట్ రికార్డు చేసుకున్నారని.. అనంతరం యువతిని కెజిహెచ్ నుండి డిశార్చ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు. అయితే యువకుడు అచూకీ తెలియాల్పి ఉంది అని చెప్పారు.

Show comments