NTV Telugu Site icon

మరో తుఫాన్‌.. ఏపీ తీరం వైపు దుసుకొస్తోంది..!

వరుస వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టమే జరిగింది.. నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. మరో తుఫాన్‌ తీరంవైపు దూసుకొస్తోంది.. అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది.. అది రేపటికి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌ – ఒడిశా తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు… ఈనెల 3వ తేదీన అది తుఫాన్‌గా మారుతుందని.. ఆ తర్వాత 24 గంటల్లో బలపడుతుందని అంచనా వేస్తున్నారు.. తుఫాన్‌గా ఏర్పడితే మాత్రం.. దానికి ‘జవాద్‌’గా నామకరణం చేయనున్నారు.. 4వ తేదీ నాటికి ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని.. 5, 6 తేదీల్లో తుఫాన్‌ శ్రీకాకుళం – ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.

Read Also: వరి వేయండి.. మంచి ధర నా బాధ్యత-టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే