Sri Krishnadevaraya University: అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఈ నెల24న ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం చేయాలని వీసీ నిర్ణయం తీసుకున్నారు. ఇంత వరకు ఓకే.. కానీ హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో ఇవ్వాలని ఉద్యోగులకు రిజిస్ట్రార్‌తో ఏకంగా సర్క్యులర్ జారీ చేయించడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చందాల వసూలుకు ఏకంగా ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌నే నియమించడం చర్చనీయాంశమైంది.
Read Also: Seediri Appalaraju: చంద్రబాబే సీఎం అయితే రాష్ట్రంలో అంధకారమే..!
ఎస్కే యూనివర్సిటీలో ఇటీవలి కాలంలో దాదాపు 25 మంది వర్సిటీ సిబ్బంది మృతి చెందారు. దీంతో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం చేయాలని నిర్ణయించారు వైస్ ఛాన్స్‌లర్. అయితే హోమం చేయడం, దాని కోసం వీసీ చందాలు అడగడాన్ని తప్పుబడుతున్నాయి విద్యార్థి సంఘాలు. వీసీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తస్తున్నారు. ఇటీవల వర్సిటీలో చాలా మంది సిబ్బంది మృతి చెందిన కారణంగానే హోమం నిర్వహించాలనుకున్నామని.. ఇష్టముంటేనే చందాలు ఇవ్వాలని, ఎవరిని బలవంతపెట్టడం లేదని రిజిస్ట్రార్ చెబుతున్నారు. ఓవైపు హోమానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు అడ్డుకుంటామన్న హెచ్చరికలతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.