NTV Telugu Site icon

Road Accident: రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Road Accident

Road Accident

Road Accident: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రాజానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు.. ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని ప్రయాణికులు కర్నూల్ నుంచి తిరుపతికి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలంలో ఒకరు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కర్నూల్ జిల్లా ఎల్లూరు నగర్ కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), కర్నూల్ జిల్లా నరసింహారెడ్డి నగర్ చెందిన కామిశెట్టి సుజాత (40), ఎల్లూరు నగర్‌కు చెందిన రావూరి వాసవి (47) లు ఉన్నారు. క్షతగాత్రులను 108లో రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఇక, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు పోలీసులు..

Read Also: Israel Hezbollah War: ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్‌బొల్లా దాడి.. తిప్పికొట్టిన ఐడీఎఫ్

Show comments