Site icon NTV Telugu

Most Wanted Terrorsts Arrest: ఏపీలో మరోసారి ఉగ్ర కలకలం.. ఇద్దరు మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల అరెస్ట్..!

Tn Ats

Tn Ats

Most Wanted Terrorsts Arrest: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉగ్ర కలకలం సృష్టిస్తోంది.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు తమిళనాడు పోలీసులు.. పలు బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదునలు.. రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని తమిళనాడుకు తరలించారు.. అయితే, చాలా కాలంగా రహస్యంగా రాయచోటిలో ఈ ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం..

Read Also: YS Jagan: జగన్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించండి.. హైకోర్టులో పిటిషన్

అనేక ఉగ్ర కేసుల్లో 30 ఏళ్లుగా పరారీలో ఉన్న ఈ ఇద్దరు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులను ఏటీఎస్‌ అదుపులోకి తీసుకుంది.. అన్నమయ్య జిల్లా జిల్లాలో అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)ను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్‌ చేసింది.. ఈ ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనుంది ఏటీఎస్‌.. అయితే, 1995 నుండి పరారీలో ఉన్నాడట అబూబక్కర్ సిద్దీక్.. 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు. 1995లో నాగూరులో పార్శిల్ బాంబు పేలుడు (తంగం మరణం).. 1999లో చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, కేరళలో 7 చోట్ల బాంబులు పెట్టడం.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా చేసుకోవడం.. 2011లో మధురైలో ఎల్.కె. అద్వానీ రథయాత్ర సమయంలో పైప్ బాంబు.. 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య.. 2013లో బెంగళూరు మల్లేశ్వరంలో బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడట.. మరోవైపు.. 26 ఏళ్లుగా పరారీలో ఉన్నాడట మొహమ్మద్ అలీ.. 1999లో తమిళనాడు, కేరళలో బాంబు ఉంచే ఘటనల్లో భాగస్వామిగా ఉన్నాడని తెలుస్తోంది.. అయితే, ఈ ఘటన మరోసారి ఏపీలో కలకలం రేపుతోంది.

Exit mobile version