Site icon NTV Telugu

MLA Amarnath Reddy: ఏపీలో రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తోంది..

Akepati

Akepati

MLA Amarnath Reddy: అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోని ఏపీలో ఉన్నంత దుర్మార్గమైన పాలన ఎక్కడ లేదు అని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తోంది.. అభివృద్ధి చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండపడ్డారు. పాలన మొత్తం లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది.. రాజకీయ నాయకులే కాదు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ పాలనలో బలి అవుతున్నారు.. ఏపీ అధికారి సిద్ధార్థ కౌశల్ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేశారు అని ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Madhavaram Krishna Rao: జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధం.. ఎమ్మెల్యే మాధవరం ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఇలానే చేస్తూ పోతే రాబోయే రోజుల్లో వాళ్లు కూడా ఇప్పటి నుంచే జైలుకు వెళ్లడానికి సిద్ధగా ఉండాలని సూచించారు.

Exit mobile version