NTV Telugu Site icon

Posani Krishna Murali Case: పోసాని బెయిల్‌ పిటిషన్‌.. అప్పటి వరకు ఆగాల్సిందే..!

Posani Krishna Murali

Posani Krishna Murali

Posani Krishna Murali Case: సినీనటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే.. నిన్ని రాత్రి 9.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు కొనసాగగా.. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.. మరోవైపు.. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయ వాది మధు.. రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక, శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.. దీంతో, పోసాని కృష్ణమురళి మూడు రోజుల పాటు జైలు జీవితం గడపనున్నారు. జడ్జి సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో అనంతపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేయలేదని సమాచారం… అయితే, అనంతపురం పోలీసులు సోమవారం పీటీ వారెంట్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌