Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: రాయలసీమ ఎంతో గొప్ప నేల అని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులకు ఎంతో పట్టుదల ఉందని పేర్కొన్నారు. గతంలో కరువు ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో మదనపల్లె ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయంటే అందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవడం వల్లే ఈరోజు అభివృద్ధి, పెట్టుబడులకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు. ఏపీ ప్రజల బంగారు భవిష్యత్తుకు జనసేన పార్టీ భరోసా ఇస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రగతితో పాటు ప్రపంచ మార్కెట్లను చేరుకునే సామర్థ్యాన్ని పెంచుకుని రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. రాయలసీమను దేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్‌కు శ్రీకారం చుట్టామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రైతుల పట్టుదలను ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ అవకాశాలతో అనుసంధానించి ప్రపంచ మార్కెట్‌కు చేరువ చేయాలని అన్నారు. రాయలసీమలో పండించే ఉద్యాన పంటలకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని కేవలం వ్యవసాయ కేంద్రంగా కాకుండా పెట్టుబడులు, ఉపాధి, వాణిజ్యం, ఉద్యాన రంగాలకు అవకాశాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాయలసీమ రైతుల సత్తాను ప్రపంచానికి చాటేలా హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?