Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: మదనపల్లెకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గాంధీ జయంతి రోజున మదనపల్లెలో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ప్రాజెక్టులను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీనేనని, వాటిని పూర్తి చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధిస్తూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేశామని అన్నారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో రాళ్లు, కోడిగుడ్లు వేసి ఇబ్బందులు పెట్టారని లోకేష్ గుర్తుచేసుకున్నారు.. అయితే, వైసీపీ నేతలు ఎన్నో ఇబ్బందులు పెట్టినా రాయలసీమ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా రాయలసీమలో పర్యటించినప్పుడు రైతుల సమస్యలను స్వయంగా చూశానని, వారి కష్టాలను విన్నానని తెలిపారు. రైతుల సమస్యలు, వారి ఇబ్బందులపై సీఎం చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.
ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న రాయలసీమను ప్రస్తుతం బంగారు నేలగా మార్చే దిశగా అభివృద్ధి జరుగుతోందని లోకేష్ అన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబేనని, ఇది వ్యవసాయ రంగంలో సంచలనాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, ఆధునిక వ్యవసాయ విధానాలతో రైతులకు మరింత ప్రయోజనం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ పౌరుషం ఏంటో అందరికీ తెలుసని, ఇప్పుడు రాయలసీమ రైతుల సత్తా ఏంటో ప్రపంచం చూస్తుందని లోకేష్ అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఈ ప్రాంత రైతులు పండించిన పంటలకు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని, రాయలసీమలో పండే పంటలు ఇతర దేశాలకు సైతం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also Read
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
రైతు సంక్షేమం, ఉద్యాన పంటల అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ సదుపాయాలను సమన్వయం చేసి రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లె వేదికగా ప్రారంభమైన హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ ప్రాంత రైతులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. రూ.లక్ష కోట్ల ప్రణాళికతో హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?