Site icon NTV Telugu

Minister Satya Kumar: స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ సెటైర్లు.. కూటమి సర్కార్ రియాక్షన్..?

Satya

Satya

Minister Satya Kumar: అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని అడుక్కుంటున్నాడు.. ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్, ముఖ్యమంత్రి ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అని పేర్కొన్నారు. ఇక, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. ఇలా అడుక్కోవడం మా కడప జిల్లాకే అవమానంగా ఉందన్నారు. పులివెందుల పులి కాదు, పులివెందుల పిల్లి నువ్వు శాసనసభకు రా ప్రజా సమస్యలపై పోరాడు అని సవాల్ విసిరారు. ప్రజలను కాకుండా జైల్లో అవినీతిపరులను పరామర్శిస్తున్నాడు.. ఒకచోట మామిడికాయలను తొక్కించాడు, మరోచోట తలకాయలను తొక్కించాడు.. నీకెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలపై కోపం అని మంత్రి సత్యకుమార్ విమర్శించారు.

Read Also: Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!

అలాగే, స్త్రీ శక్తి బస్సు పథకంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. మహిళలు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.. పక్క ఊళ్లో అమ్మని చూడాలని ఉన్నా, అత్తని చూడాలని ఉన్నా రోజు వెళ్తున్నారు.. పొద్దున ఒక్క సీరియల్ మధ్యాహ్నం ఒక్క సీరియల్ రాత్రి ఒక్క సీరియల్ ను ఒక్కొక ప్రాంతంలో చూడొచ్చు అని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా తోడికోడళ్ళు ఫోన్లలో కొట్లాడకుండా ఉచిత బస్సుల్లో వెళ్లి మరీ కొట్లాడి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.. ఇలాంటి వెసులుబాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారు అని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.

Exit mobile version