Site icon NTV Telugu

Andhra Pradesh: కువైట్‌ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం

Rangareddy Crime

Rangareddy Crime

Andhra Pradesh: కువైట్ ఫ్లైట్ లో మిస్సైన పెనగలూరు మండలం పొందలూరు వాసి రాజబోయిన మనోహర్ కథ విషాదాంతం అయ్యింది. మార్గ మధ్య లో రాజబోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన నిన్న మృతి చెందారు.. ఈనెల 17వ తేదీన శ్రీలంక ఎయిర్ వేస్ ఫ్లైట్ లో రాజబోయిన మనోహర్ బయలుదేరి ఇంటికి ఫోన్ చేసి తాను 18వ తేదీ మూడు గంటలకు చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగుతానని తెలిపాడు. ఎక్కిన తర్వాత మార్గ మధ్య లో రాజ బోయిన మనోహర్ పెరాలసిక్ ఎటాక్ కావడంతో ఆయనను ప్లేట్ సిబ్బంది శ్రీలంకలోని హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులకు విషయం తెలియక వారు ఆందోళన చెందారు. నిన్న ఆయన శ్రీలంక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రాజబోయిన మనోహర్ స్వగ్రామానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు..

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

Exit mobile version