NTV Telugu Site icon

Shocking Incident: షాకింగ్ ఘటన.. ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్‌ దాడి..

Shocking Incident

Shocking Incident

Shocking Incident: ఇటీవల పెళ్లి మండపంలో జరిగిన వింత ఘటనలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని కామెడీ, మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు పీఠలపై కూర్చొని ఉండగా.. ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Bandi Sanjay: బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల ప్రభావం ఇక్కడ ఉండదు..

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలో మరి కొద్ది నిమిషాల్లో పెళ్లి ముహూర్తం ఖరారవుతుందని అనుకునేలోపే ప్రియురాలు పెళ్లి వేదిక వద్దకు వచ్చి హంగామా చేసింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషా పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. తిరుపతికి చెందిన జయ అనే వివాహితతో సయ్యద్ పాషా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ దశలోనే ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని జయ పెళ్లి మండపానికి చేరుకుంది. అందరూ చూస్తుండగానే భాషాని నానా దుర్భాషలాడింది.

Read also: Mallu Bhatti Vikramarka: నిధులు విషయంలో డోకా అవసరం లేదు.. 10 కోట్లు కేటాయింపు..

అంతేకాదు షాదీఖానాలో పెళ్లి కొడుకు సయ్యద్ భాషాపై కత్తి, యాసిడ్ తో దాడి చేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు ఈ ఘటన చూసి షాకయ్యారు. ఈ గొడవలో కొంతమంది మహిళలపై యాసిడ్‌ పడటంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ భాషా, అతని స్నేహితురాలు జయను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్‌ వేదిగా కేటీఆర్‌ ట్వీట్‌

Show comments