NTV Telugu Site icon

Elephants Attack: ఏనుగుల గుంపు దాడిలో ఐదుగురు భక్తులు మృతి..

Elephants Attack

Elephants Attack

Elephants Attack: అన్నమయ్య జిల్లాలో విషాదయం చోటు చేసుకుంది.. ఓబులవారిపల్లి మండలం వై కోట గుండాల కోన సిద్దేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.. అయితే, క్షేత్రానికి వెళ్తున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరు రైల్వే కోడూరు మండలం కన్యగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు.. గుండాల కోనమీదుగా నడుచుకుంటూ తలకోనకు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.. మొత్తం 14 మంది భక్తులు తలకోనకు వెళ్తుండగా.. దాడి చేసింది ఏనుగుల గుంపు.. ఈ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు.. వీరిలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు.. మరో 8 మంది సురక్షితం తప్పించుకున్నారు.. గాయపడ్డ క్షత గాత్రులను చికిత్స కోసం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించారు..