Site icon NTV Telugu

Farmer Suicide: రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి రైతు ఆత్మహత్య

Farmer

Farmer

Farmer Suicide: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ లోకి ఎక్కించాలని పలుమార్లు కోరిన పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రైతు వెంకటాద్రి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన వాల్మీకిపురం మండలం టేకలకోనలో జరిగింది.

Read Also: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి

అయితే, రైతు వెంకటాద్రి తన తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయలేదని మనస్థాపం‌ చెందాడు.. చేతి పైన, సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం రెవెన్యూ అధికారులు, గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు రాసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న వాల్మీకిపురం పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version