Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తా.. సినిమాలను.. రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తా..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మైసూర్‌వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు.. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం.. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త.. మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా… గ్రామస్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో 70 శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లే.. అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.. స్వర్ణ గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే, సినిమాలను.. రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తాను అన్నారు.

Read Also: Balayya: సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి.. మ్యాటర్ ఏంటంటే..?

ఇక, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి.. గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది… గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. గత ప్రభుత్వం 51 వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు.. అయితే 25 వేల కోట్లు ఏమై పోయాయో తెలియాలన్నారు.. అన్నా హజారే సర్పంచ్‌గా గెలిచి దేశంలోనే మార్పు తీసుకొచ్చారు.. ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశంలో మార్పు తేవచ్చని ఆయన నిరూపించారని పేర్కొన్నారు. కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ… గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పని చేస్తా.. రాష్ట్రం ఎంతో అప్పుల్లో ఉన్న పెన్షన్లు అందించాం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఫైనాన్స్ పై మంచి పట్టు ఉందని ప్రశంసించారు.

Exit mobile version