NTV Telugu Site icon

Anjuru Srinivasulu: శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద చల్లడం తగదు

శ్రీ కాలహస్తి

శ్రీ కాలహస్తి

Anjuru Srinivasulu: శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద చల్లోద్దని.. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. ఆలయం నుంచి వెండి తీసుకువెళ్లి బెంగళూరులో విక్రయించి.. ఆ సొమ్ములు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న హేమచంద్ర రెడ్డి మాటలను ఆయన ఖండించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినే విధంగా రాజకీయ అవసరాల కోసం ఆరోపణలు చేయొద్దని బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు. దేవస్థానం నుంచి సూది సైతం అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేదని.. నిర్దిష్ట ఫిర్యాదు అందితే సమగ్ర విచారణకు దేవస్థానం సిద్ధమే అన్నారు.
READ MORE: AP BJP: ఏపీకి రేపు కేంద్ర మంత్రుల రాక
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న దేవస్థానంపై బురద చల్లడం తగదన్నారు. ఆలయం నుంచి సూది తీసుకువెళ్లాలన్నా తప్పనిసరిగా ఎస్పీఎఫ్ పోలీసుల అనుమతి ఉండాలని.. అలాంటిది వెండి తీసుకెళ్లడం ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై తమకు గానీ, ఈవోకు గాని నేరుగా ఫిర్యాదు అందలేదన్నారు. తిరుపతిలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.. కానీ తిరుపతి ఎస్పీ నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఎలాంటి విచారణ నోటీసు రాలేదన్నారు. దేవస్థానంలో ఏదైనా అవకతవక జరిగి ఉంటే నిర్దిష్ట ఫిర్యాదిస్తే దానిపై విచారణకు వెంటనే ఆదేశిస్తామని తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దేవస్థానంపై ఆరోపణలు చేయడం, ఆందోళన చేస్తా, ముట్టడి చేస్తాం అనడం తగదన్నారు. గతంలో బొజ్జల  గోపాలకృష్ణారెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. హెచ్చరికలు, జాగ్రత్త అంటూ బెదిరించడం గమనిస్తే ఆయన తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు.  శ్రీకాళహస్తి ప్రజలు రౌడీయిజాన్ని సహించరని సామ్యలు మంచివారిని మాత్రమే ఆదరిస్తారనేది గుర్తుపెట్టుకోవాలన్నారు.