Site icon NTV Telugu

Andrapradesh : కాకినాడలో రోడ్డు ప్రమాదం..గుడిలోకి దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు మృతి..

Kakinada Accident

Kakinada Accident

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అతి వేగంగా వచ్చిన టిప్పర్ గుడిలోకి దూసుకొచ్చింది.. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్, క్లీనర్, గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.. పలువురుకు గాయాలు తగిలాయి.. గ్రావెల్‌ లోడుతో వెళ్తన్న టిప్పర్‌ అతివేగంగా ఢీకొట్టడంతో వినాయక ఆలయం పూర్తిగా ధ్వంసమైంది..

వివరాల్లోకి వెళితే.. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్ తో పాటు గుడిలో నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై దూసుకుపోయింది.. దాంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు..మృతులు శేఖర్‌, నాగేంద్రలను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.. ఇది ఇలా ఉండగా మరో ప్రమాదం పల్నాడులో జరిగింది.. దాచేపల్లిలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని గురజాల ఆస్పత్రికి తరలించారు.. డ్రైవర్ నిద్ర మత్తె కారణమని పోలీసులు గుర్తించారు.. ఈ ఘటనల పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version