Andrapradesh : జైలు బయట తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని కలవడానికి అనుమతించమని ఏడుస్తోంది. దాన్ని మొత్తం ఆ వ్యక్తి రికార్డ్ చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా, క్షణాల్లో వైరల్ అయ్యింది.. తల్లి కోసం కూతురు పడుతున్న ఆవేదన అందరిని కరిగించింది..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఖాదీజా బీ అనే మహిళ భర్త వదిలెయ్యడంతో కుటుంబ పోషణ కోసం దొంగగా మారింది.. ఓ దొంగతనం కేసులో డిసెంబర్ 12న జైలు పాలైంది. భర్త వదిలేయడంతో కుటుంబ పోషణ భారం అయ్యి, చిన్న చిన్న నేరాలకు పాల్పడింది. దీంతో ప్రస్తుతం ఆమెను జైలుకు వెళ్లేలా చేసింది. ఈ విషయాలు తరువాత తెలిసాయి.. ఈమెకు ఐదుగురు సంతానం.. వారిలో ఒకరే ఈ తొమ్మిదేళ్ల బాలిక. తల్లిని కలవాలంటూ రోధిస్తుంది. ఈ వీడియో తీసిన తరువాత ఆ వ్యక్తి వెంటనే జైలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని, వెంటనే బాలికను తన తల్లితో కలవడానికి అనుమతి ఇచ్చారు.. ఆ తల్లిని మందలించి జైలు నుంచి విడుదల చేసినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
In #AndhraPradesh‘s #Kurnool, Heart wrenching video of a 9 year old girl crying and knocking on the gate of the Kurnool sub jail was recorded by a passerby who was crying to be allowed to meet her mother.
Khadija bee (35) a single parent was reportedly jailed on Dec 12 had… pic.twitter.com/LnKzxVd8kR
— Hate Detector 🔍 (@HateDetectors) December 17, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?