NTV Telugu Site icon

Andrapradesh : 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. రాళ్లతో ముఖం పై దాడి..

Rapee

Rapee

కామాంధులకు వావి వరుసలు అస్సలు అవసరం లేదు.. ఆడది అయితే చాలు వయస్సు కూడా అక్కర్లేదు.. వారి కోరికలు తీరితే చాలు అనుకుంటారు.. ఎన్ని రకాల కొత్త చట్టాలు వచ్చినా.. కఠినంగా శిక్షలు వేసిన మృగాల్లో మార్పులు రావడం లేదు.. అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు.. తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది..13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చారు. లైంగిక దాడి తర్వాత చిత్రహింసలకు గురిచేసి చిన్నారి ముఖంపై బండరాళ్లు విసిరి చంపినట్లు మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుంది..

వివరాల్లోకి వెళితే.. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్ గొల్లపల్లి శివారులో 13 ఏళ్ల బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ముఖం మొత్తం చిద్రమై ఒంటిపై బట్టలు లేకుండా అనుమానాస్పద రీతిలో బాలిక మృతదేహం పడివుంది. గ్రామస్తులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో దొరికిన స్కూల్ పుస్తకాల ఆదారంగా విద్యార్థినిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..

బాలికను అత్యాచారం చేసి చంపారా.. లేక ఏదైనా కారణాల వల్ల చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. స్కూల్ నుండి బాలికను తీసుకువచ్చి ఇలా హత్యాచారానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. బ్యాగ్ లోని పుస్తకాలపై వున్న పేరు, వివరాలను బట్టి బాలిక తల్లిదండ్రులను గుర్తించి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..