Site icon NTV Telugu

AndhraPradesh-BalKrishna: విద్యుత్‌ వాహనాలపై ఆంధ్రప్రదేశ్‌ ఫోకస్‌. మెప్పించని ‘బాల్‌కృష్ణ’.

Andhrapradesh Balkrishna

Andhrapradesh Balkrishna

AndhraPradesh-BalKrishna: విద్యుత్‌ వాహనాల రంగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టిపెట్టింది. రానున్న కొన్నేళ్లలో 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లైట్‌ హౌజ్‌ స్టేట్‌గా నిలవాలని ఆకాంక్షిస్తోంది. ఈ దిశగా ఇవాళంతా కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈవీ సంస్థల సీఈఓలతో ఏపీ పరిశ్రమల, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వర్చువల్‌గా భేటీ అవుతున్నారు. నూతన విధాన రూపకల్పన కోసం వాళ్ల నుంచి సలహాలను, సూచనలను తీసుకోనున్నారు. ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం-మూవింగ్‌ ఇండియా నెట్వర్క్‌ ఆన్‌ షేపింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ మొబిలిటీ’ ఫ్రేమ్‌ వర్క్‌ కింద చేపడుతున్న మొదటి కార్యక్రమం ఇది అని మంత్రి తెలిపారు.

మెప్పించని ‘బాల్‌కృష్ణ’

టైర్లు, రబ్బర్‌ ఉత్పత్తుల విభాగంలో పేరొందిన బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్‌ నిరాశాజనకమైన ఫలితాలను ప్రదర్శిస్తోంది. ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో ఈ సంస్థ షేరు 6 శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.2190కి కుంగిపోయింది. ఇవాళే కాదు. రెండు, మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. జూన్‌ త్రైమాసికంలో లాభాలు భారీగా పడిపోవటంతో ఈ దుస్థితి దాపురించింది. అధిక ముడి సరుకుల ధరలే నష్టాలకు కారణమని బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్‌ చెబుతోంది. యూరప్, అమెరికాలో డిమాండ్ నెమ్మదించనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలోనూ ఆశాజనకమైన ఫలితాలేమీ వెలువడే అవకాశాలు లేవని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

RBI circular: అట్లయితే డబ్బులే. బంగారం ఇవ్వం. ఆర్బీఐ సర్క్యులర్‌.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల నేపథ్యంలోనూ స్టాక్‌ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో ఇవాళ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 264 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 58,563 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 17,455 పైనే కొనసాగుతోంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4% లాభపడ్డాయి. మెటల్‌, ఎఫ్‌ఎంసీజీలకు 0.7 శాతం ప్రాఫిట్స్‌ వచ్చాయి. ఎల్‌ఐసీ హౌజింగ్‌ షేర్లు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. టెక్‌ మహింద్రా, నెస్లే ఇండియా, మారుతీలు నష్టాలు చవిచూశాయి. రూపాయి మారకం విలవ 78.87 వద్ద ఉంది.

Exit mobile version