వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగు చెందారు.. వైసీపీ పాలన నుండి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఉత్తుత్తి పదవులు ఇచ్చి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు.. ఎవరికి కావాలంటే వారికి కార్పోరేషన్ పదవులు ఇచ్చారు.. కాపులు, బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది విమర్శించారు. ఇక, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. ఆ స్కామ్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని సీబీఐ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు.. లిక్కర్ స్కామ్‌లో ఉన్నవాళ్లు తప్పించుకోలేరు.. స్కామ్‌లో ఉన్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.. లిక్కర్ స్కామ్ ద్వారా పార్టీలకు లబ్ధి చేకూరితే విచారణలో తేలుతుందన్నారు జీవీఎల్.
Read Also: Double Decker Buses : గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు
మరోవైపు, వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్వటైజ్‌మెంట్ డబ్బాలు కొట్టుకోవడం ఆపి.. ఆ నిధులు ప్రాజెక్టులకు కేటాయించాలి అని సూచించారు ఎంపీ జీవీఎల్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కేంద్ర ప్రమేయం లేదని స్పష్టం చేసిన ఆయన.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరినీ రక్షించాల్సిన అవసరం బీజేపికి లేదన్నారు. ఇక, పోలవరం నిర్మా ణంలో గత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిపై అనేక ఆరోపణలు ఉన్నా యి. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్య మైందని.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ గతంలోనే ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పిన విషయం విదితమే.