NTV Telugu Site icon

ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్…

తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం… రేపటికి తుఫాన్ గా మారనుంది. అయితే ఈ తుఫాన్ కు యాస్ గా నామకరణం చేసారు. ఈ “యాస్”తీవ్ర తుఫాన్ గా బలపడి ఈనెల 26న ఒడిషా,బెంగాల్ తీరాన్ని తాకుతుందని అంచనా వేశారు అధికారులు. బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తుఫాన్ కారణంగా ఐదు రోజులు మత్య్సకారుల వేటపై నిషేధం విధించారు. బంగాళాఖాతంలో తుఫాను దృష్ట్యా విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. ఈ కంట్రోల్ రూం నెంబర్లు 0891-2590102, 0891-2590100.