ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు వరకు విదర్భ మీదుగా ఉత్తర కోస్తా తమిళనాడు మరియు తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.భారీ వర్షాలు, విజయనగరం ,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోఒకటిలేకరెండుచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది, భారీ వర్షాలు ఒకటిలేకరెండు చోట్ల కురిసేఅవకాశంఉంటుంది.ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసేఅవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .
రాయలసీమ :
రాయలసీమ లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.