NTV Telugu Site icon

విజయవాడలో టీకా మ‌హోత్సవం… 122 కేంద్రాల్లో

నేడు విజయవాడలో 122 కేంద్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ జరుగుతుంది. 12 శాశ్వ‌త వ్యాక్సినేష‌న్ కేంద్రాలతో పాటు మరో 286 స‌చివాల‌యం ప‌రిధిలో 110 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి, రెండోవ డోస్ టీకా పంపిణీ చేస్తున్నారు. అన్ని కేంద్రలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ, 45 సంవ‌త్స‌రాలు నిండిన వారికి మొద‌టి ,రెండోవ డోస్ టీకా పంపిణీ జరుగుతుంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు నిపుణులు. దాంతో ఏపీ వ్యాక్సినేష‌న్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.