NTV Telugu Site icon

Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..

Ap News

Ap News

ఈరోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి వీలులేదు.. కొందరు కేటుగాళ్ళు మహిళను నమ్మించి అతి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. తెలిసిన యువకుడు కదా అని నమ్మాడు.. నిండా ముంచేసాడు..ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు.. ఇక భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. దిశ టీం వెంటనే రంగంలోకి దిగి ఆమెకు భరోసా ఇచ్చింది. నిందితుడిపై కేసు ఫైల్ చేసింది.. అసలు నిజాలను బయటపెట్టింది..

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది… కోన సీమ జిల్లా గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, మీనా అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వెంటబడి వేధించాడు. అప్పుడే అచ్చిరెడ్డిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆమెను ఇబ్బంది పెట్టనని పెద్దమనుషుల ముందు అచ్చిరెడ్డి చెప్పడంతో ఆ గొడవ అక్కడితో సర్దు మణిగింది.. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది..

మీనాను రావులపాలేనికి చెందిన పెద్దిరెడ్డితో మీనా పెళ్లి జరిపించారు. వారి దాంపత్యం హ్యాపీగా సాగింది. ఆయన ఉపాధి రీత్యా కొన్ని రోజుల క్రితమే దుబాయ్ వెళ్లాడు. ఆయన దుబాయ్ వెళ్లిన తర్వాత అచ్చిరెడ్డి వేధింపుల పర్వం మళ్లీ మొదలైంది. అచ్చిరెడ్డి గతంలో మీనాతో దిగిన ఫొటోలను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో తన భర్తకు పంపాడు.. అలా తరచూ చేస్తూ వస్తున్నాడు…ఇక మీనా దిశ పోలీసులను ఆశ్రాయించింది.. అసలు విషయాన్ని పోలీసులకు తెలిపారు.. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.. మార్ఫింగ్ ఫొటోలను, బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఆమెకు భరోసా కల్పించారు..

Show comments