Site icon NTV Telugu

Andhra Pradesh: విద్యార్థులకు గమనిక.. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లు విడుదల

Tenth Exams

Tenth Exams

ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. హాల్‌టిక్కెట్లను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టామని.. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్‌లోడ్ చేసి వాటిపై సంతకాలు చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు. విద్యార్థుల ఫోటోలు సరిగ్గా లేకపోతే సరైనవి అంటించి వాటిపై సంతకాలు చేసి ఇవ్వాలన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి అందించాలని సూచించారు.

కాగా పదో తరగతి పరీక్షలు పూర్తయని వెంటనే విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ఇవ్వనుంది. మరోవైపు ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 23 వరకు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మే 7 నుంచి మే 24 వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు నిర్వహించనున్నారు.

Child Missing: ఆడుకుంటూ అడవిలోకి వెళ్లిపోయిన చిన్నారి.. 36 గంటల తర్వాత ఏమైందంటే..?

Exit mobile version