ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ఆముదాలవలస వెళ్లనున్నారు.. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరుకాబోతున్నారు. అయితే, సీఎం పర్యటన దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధిస్తారని, కర్ఫ్యూ ప్రకటిస్తారనే ప్రచారం సాగింది.. ఆ వార్తలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆముదాలవలసకు రేపు 3.20 గంటలకు వస్తారు.. 10 నిమిషాల పాటు ప్రజలతో మమేకం అవుతారని.. సాయంత్రం 4.15 గంటల వరకు మాత్రమే ఆముదాలవలస పట్టణంలో ఉంటారని తెలిపారు.. అయితే, సీఎం జగన్ వస్తే ఆముదాలవలసలో షాపులు అన్ని మూసేస్తారు అని వదంతులు వస్తున్నాయి.. వాటిని నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు.. 144 సెక్షన్, కర్ఫ్యూ అని వస్తున్న పుకార్లు నమ్మొద్దన్నారు.
Read Also: Kishan Reddy: రానున్న నాలుగేళ్లలో 100 ఎయిర్పోర్ట్ లు స్థాపిస్తాం
ఇక, ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికారులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ లు, పార్టీ ముఖ్య నేతలు ఆముదాలవలసకు వస్తారు.. కానీ, ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవచ్చు… ఎవరి పనులు వారు చేసుకోవచ్చు… భయం వద్దన్నారు.. ఈ సందర్భంగా ఏ షాపులను మూసి వేయం.. కానీ, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా స్థానికులు పోలీసులకు సహకరించాలని సూచించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. సీఎం వైఎస్ జగన్ ఉండేది గంట కాలం మాత్రమే అన్నారు. ఇక, అందరూ నా కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులని ఆశీర్వదించండి. అందరూ సంతోషంగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుందన్నారు.. వదంతులు నమ్మవద్దు… పెళ్లికి వచ్చేవారికి అన్ని ఏర్పాట్లు చేశాం. పార్కింగ్ ప్లేసెస్ వద్ద నుండి పెళ్లి మంటపం వరకు వృద్ధులు కోసం ప్రత్యేక మిని బస్ లు ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు తమ్మినేని సీతారాం.