IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- ఏపీపై వాతావరణ వ్యవస్థల ప్రభావం కొనసాగుతోంది
- మూడు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన
- కోస్తా ప్రాంతాల్లో బలమైన గాలుల హెచ్చరిక
- నైరుతి రుతుపవనాలపై తాజా అప్డేట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD : ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నైరుతి రుతుపవనాలు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.
Also Read
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ఇక నైరుతి రుతుపవనాల పురోగతిపై కూడా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 27 నాటికి అవి అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?