Site icon NTV Telugu

Andhra Pradesh: ఏప్రిల్ 1 నాటికి కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్

ఏపీలో కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నాటికి వస్తుందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా అనుకున్న విధంగా 11 రెవెన్యూ డివిజన్‌లు కాకుండా అదనంగా మరో ఐదు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్‌ల సంఖ్య 15కి చేరనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానికుల నుంచి ఇప్పటి వరకూ 9 వేలకు పైగా విజ్ఞప్తులు రాగా వాటిపై తుది కసరత్తు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని.. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల మార్పులు వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించనుంది. మరోవైపు ఏప్రిల్ 2న ఉగాది రోజు కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు.

https://ntvtelugu.com/cpi-leader-ramakrishna-fires-on-cm-ys-jagan-and-assembly-speaker-over-assembly-session/
Exit mobile version