బాడీ లాస్ కోసం ప్రయత్నిస్తే మైండ్ లాస్ అయినట్టుంది అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడు.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడు.. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది అని ఎద్దేవా చేశారు.. అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే ఆ జాబితా రిలీజ్ చేయొచ్చు కదా? అని సవాల్ చేశారు.. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయలేదు.. అధికారంలో ఉన్నప్పుడు గుర్ఖా వాళ్లకు సూటు బూటు వేసి ఫోటోలు తీసి డ్రామాలు ఆడారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Munugodu Bypoll : మునుగోడులో కాసుల వర్షం
టీడీపీ హయాంలో చెప్పిన మాటలకు, చేసుకున్న ఎంఓయూలకు, వాస్తవ పరిస్థితికి సంబంధం ఉందా ? అంటూ నారా లోకేష్‌ను నిలదీశారు మంత్రి అమర్‌నాథ్.. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పరిశ్రమలు గ్రౌండ్ అయిన తర్వాతే వివరాలు చెప్పాలి అన్నారని తెలిపారు.. ఒక్క ఫోన్ కాల్ తో పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారన్న ఆయన.. ఏ ముఖ్యమంత్రి ఇలా చెబుతారు ? అని ప్రశ్నించారు. ఇక, వైఎస్ భారతమ్మ గురించి నారా లోకేష్ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు ? అని ఫైర్ అయ్యారు అమర్‌నాథ్.. రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు.. నీకు, బ్రాహ్మణికి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఇంట్లో తేల్చుకోండి.. అంతే.. కానీ, మా చేత బ్రాహ్మణిని తిట్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్? అని మండిపడ్డారు.. బీచ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో తిరిగే చదువులు, సంస్కృతి మాకు లేవు అంటూ నారా లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్..